: మోత్కుపల్లిది హత్యలు, మోసాల చరిత్ర: ఎర్రోళ్ల
టీడీపీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహుల ఆరోపణలపై టీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మోత్కుపల్లిది హత్యలు, మోసాలు చేసిన చరిత్రగా పేర్కొన్నారు. ఇటీవల తనపై హత్య చేసేందుకు టీఆర్ఎస్ రెక్కీ నిర్వహించిందన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఎర్రోళ్ల మండిపడ్డారు. ఆయనపై రెక్కీ నిర్వహించాల్సిన అవసరం తమకు లేదన్నారు.