: ఆస్తి తగాదాలో తమ్ముడిపై అన్న బాణంతో దాడి


అనుబంధాలు, ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా బంధాలు సమాధి అయిపోతున్నాయి. అందుకు సాక్ష్యంగా నిలిచే ఘటన భద్రాచలంలోని గిరిజన అన్నదమ్ముల మధ్య జరిగింది. తరాల సంప్రదాయాల చాటున సంఘజీవనం సాగించే ఏజెన్సీల్లో గిరిజనులు ఆస్తుల కోసం పోట్లాడుకున్నారు. భద్రాచలం మన్యంలోని కూనవరం మండలం మెట్టరామవరం గ్రామానికి చెందిన కరక నాగయ్య, చేలం భద్రయ్య అన్నదమ్ములు. వీరిద్దరి పొలాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. భూతగాదా రావడంతో భద్రయ్యపై అన్న నాగయ్య బాణంతో దాడి చేశాడు. భద్రయ్య గుండె క్రింది భాగంలోకి బాణం చొచ్చుకుపోవడంతో, అతని పరిస్థితి విషమంగా మారింది. భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో భద్రయ్య చికిత్స పొందుతున్నాడు. గిరిజనులు జంతువులను వేటాడేందుకు ఈ బాణాలు ఉపయోగిస్తుంటారు.

  • Loading...

More Telugu News