: మహాబోధి ఆలయాన్ని సందర్శించిన రాజ్ నాథ్, జైట్లీ
బాంబు దాడులకు గురైన గయలోని మహోబోధి ఆలయాన్ని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆ పార్టీ రాజ్యసభ నేత అరుణ్ జైట్లీ ఈ ఉదయం సందర్శించారు. పేలుళ్లకు సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రాధాన్యం గల పవిత్ర స్థలంపై దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనను యూపీఏ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.