: సిటీలైట్ శిధిలాల తొలగింపు ముమ్మరం.. ఆచూకీలేని ఇద్దరు
సికింద్రాబాద్ లో నిన్న ఉదయం కుప్పకూలిన సిటీలైట్ హోటల్ భవన శిధిలాల తొలగింపు ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా.. 21 మందికి గాయాలైన విషయం తెలిసిందే. అయితే, హోటల్లో పనిచేసే వంటమనిషి, మరో కార్మికుడి జాడ లేదు. వారు కూడా శిధిలాల కిందే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. జేసీబీ యంత్రాలతో శిధిలాలను జాగ్రత్తగా తొలగిస్తున్నారు.