: ‘వీడు’ మనలాగే కాఫీ చేస్తాడట


రోబో సినిమాలో చిట్టి గుర్తున్నాడుగా... బోలెడన్ని పనులు చకచకా చేసేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాడు... అయితే ఈ రోబో అన్ని పనులు చేయలేడుగానీ... ఎంచక్కా మనకు చక్కటి కాఫీ తయారు చేసి ఇస్తాడట. అంతేకాదు వాతావరణం గురించి కూడా చెబుతాడట.

జపాన్‌కు చెందిన ఒక సంస్థ రూపొందించిన రోబో చక్కగా మనిషిలాగే కాఫీ తయారు చేస్తుందట. కాఫీ కలపడమే కాదు క్యాలెండర్‌ను నిర్వహించడం, వాతావరణం గురించి చెప్పడం వంటి పనులను ఎంచక్కా చేసేస్తుందట. ఈ రోబోపేరు రాపిరో. ఈ రోబోలో కెమెరా అమర్చి దృశ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేయవచ్చని ఈ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News