: బ్లూబెర్రీలతో చక్కటి ఆరోగ్యం


ప్రపంచ వ్యాప్తంగా కాస్తో కూస్తో చదువుకున్న వారు, ఆర్ధికంగా కాస్త బాగున్నవారు ఎక్కువగా దృష్టి పెట్టేది మొదట తమ ఆరోగ్యం గురించి. ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ వార్త. మన ఆరోగ్యం బాగుండాలంటే మన జీర్ణవ్యవస్థ చక్కగా ఉండాలి. జీర్ణ వ్యవస్థను అభివృద్ధి చేసే అంశాల్లో బ్లూబెర్రీలు చాలా బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

బ్లూబెర్రీ పండ్లు మన పేగుల్లో జీర్ణ వ్యవస్థకు అవసరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి జీర్ణమయ్యే సామర్ధ్యాన్ని పెంచుతాయని అమెరికాలోని మైనే విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పేగుల్లో సూక్ష్మజీవుల ప్రభావం, జీర్ణవ్యవస్థపై బ్లూబెర్రీల ప్రభావం అనే అంశంపై వీరు పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో బ్లూబెర్రీ పండ్లలో పెద్ద పేగులో మేలుచేసే బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడే మొక్కల పీచు లక్షణాలు ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. ఈ లక్షణం జీర్ణ, ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న వివియన్‌ చిహువా వు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News