: 'సిటీ లైట్' దుర్ఘటనపై చిరంజీవి స్పందన


సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లోని 'సిటీ లైట్' హోటల్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. వారిని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. 12 మందిని బలిగొన్న ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News