: డీఎస్సీ నోటిఫికేషన్ పై ఈసీతో చర్చిస్తాం: పార్థసారధి


డీఎస్సీ నోటిఫికేషన్ పై ఎలక్షన్ కమీషనర్(ఈసీ)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖమంత్రి పార్థసారధి తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు వస్తే ఎన్నికల తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. 24 వేలకు పైగా డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపధ్యంలో మంత్రి ఈ రకంగా స్పందించారు. అలాగే ఐఐటీ సీట్లలో రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన తెలిపారు. సీట్ల విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. మేనేజ్ మెంట్ సీట్లు, సీబీఎస్ సిలబస్ మధ్య వివాదంతోనే సమస్య ఉత్పన్నమైందని మంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News