: భారత టెన్నిస్ లో అత్యుత్తమ ర్యాంకర్ రోహన్ బోపన్న


అంతర్జాతీయ టెన్నిస్ లో ఓ భారతీయ క్రీడాకారుడు అత్యుత్తమ కెరీర్ ర్యాంకు సాధించాడు. యువ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న భారతీయ టెన్నిస్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. ఈ రోజు విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంకు సాధించిన బోపన్న భారతదేశంలో ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకు అందుకున్న తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. బోపన్న తన భాగస్వామి ఫ్రెంచ్ క్రీడాకారుడు అయిన రోగర్ వాసెలిన్ తో కలిసి ఇటీవల వింబుల్డన్ సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు. వింబుల్డన్ అత్యుత్తమ ప్రదర్శనతొ ఎక్కువ పాయింట్లు సాధించిన బోపన్న ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. నిలకడైన ప్రదర్శన చూపితే బోపన్న మరింత మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News