: రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: ఆనం బ్రదర్స్ ఆకాంక్ష
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆనం బ్రదర్స్ ఆకాంక్షించారు. నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆయన విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే గతంలో కేంద్రానికి నివేదించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఆంధ్రరాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారని తెలిపారు. రాహుల్ ప్రధాని అభ్యర్ధిగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు.
రామనారాయణ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని అంగీకరించమని తెలిపారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న వారు సమైక్యద్రోహులని వివేకా అన్నారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్సీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వివేకా విమర్శించారు.