: మహాబోధి ఆరామంలో పదమూడు బాంబులు పెట్టారు: షిండే వెల్లడి


బౌద్ధులకు పవిత్రస్థలమయిన బుద్ధగయ మహాబోధి క్షేత్రం ఆదివారం నాడు బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. బీహార్లోని ఈ దివ్యారామంలో తీవ్రవాదులు 13 బాంబులు పెట్టారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. ఈ మధ్యాహ్నం ఆయన, పుణేకు సమీపంలో తాలేగావ్ వద్ద, సీఆర్పీఎఫ్ సిబ్బంది కోసం నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో పది బాంబులు పేలాయని, మరో మూడింటిని బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసిందని ఆయన తెలిపారు.

కాగా, ఈ విధ్వంసంతో సంబంధం ఉందని భావిస్తూ ఓ అనుమానితుడిని నేడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆరామం ప్రాంగణంలో ఓ ఐడెంటిటీ కార్డు పడి ఉందని, దాని ఆధారంగా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని మగధ రేంజి డీఐజీ నయ్యర్ హస్నయిన్ ఖాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News