: ధోనీ ముఖానికి కేకులద్ది శుభాకాంక్షలు
ధోనీ 32వ పుట్టిన రోజు సంబరాలు వెస్టిండీస్ నేలపై ఘనంగా జరిగాయి. భారత క్రికెటర్లతో పాటు, విండీస్ క్రికెటర్లు కూడా ధోనీని శుభాకాంక్షలతో ముంచెత్తారు. కేకు ముక్కలతో ధోనీ ముఖాన్ని సరదాగా రుద్దేశారు. ఇలా తనను ఆనందంలో పరవశింపజేసిన వారందరికీ ధోనీ ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పాడు. "అందరికీ ధన్యవాదాలు... ముఖ్యంగా బ్రేవోకి... ప్రేమపూర్వక రోజునాడు ముఖమంతా, జుట్టుకు కేకులతో పూత పూసినందుకు మరీ!" అంటూ ధోనీ సెలబ్రేషన్ ఫొటోతోపాటు ట్వీట్ చేశాడు.