: స్టార్ డమ్ పోతుందన్న భయం లేదు: ఇర్ఫాన్ ఖాన్
స్టార్ డమ్ పోతుందన్న భయం తనకు లేదని బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలిపాడు. ప్రేక్షకులు ఓ అంచనాతో సినిమాకు వస్తారని, వారిని ఎంత కొత్తగా అలరించామన్నదే తనకు ముఖ్యం కానీ స్టార్ డమ్ తో తనకు సంబంధం లేదన్నారు. పాన్ సింగ్ తోమర్, సాహిద్ బీవీ అవుర్ గ్యాంగ్ స్టర్, లైఫ్ ఆఫ్ పై ... వంటి సినిమాలతో అభిమానులకు చేరువైన ఇర్ఫాన్ ఖాన్, తాను అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఏదైనా చేస్తానన్నారు. ప్రజల్ని కొత్తగా అలరించేంత వరకే తమ లాంటి నటులకు మనుగడ అని అన్నారు. ప్రయోగాలతో ఎప్పటికప్పుడు తాజాగా, కొత్తగా కనిపించేందుకు తపన పడతానని ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. ఈ క్రమంలో స్టార్ డమ్ పోతుందన్న భయం లేదని, మంచి నటుడిగా పదికాలాలు గుర్తుండి పోవాలి కానీ, స్టార్ గా కాదన్నది తన అభిప్రాయమన్నాడు.