: సల్మాన్ ఖాన్ పై మరో కేసు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. 2002లో సల్మాన్ కారును వేగంగా నడిపి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిని తొక్కించిన కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే, ఈ కేసులో మీడియా వక్రీకరణ చేస్తోందని, అలాంటి వాటికి సమాధానం ఇవ్వడంతో పాటు, వాస్తవాలను వివరించేందుకు సల్మాన్ ఏకంగా ఒక వెబ్ సైట్ www.salmankhanfiles.com ను ప్రారంభించాడు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ సామాజిక ఉద్యమకర్త హేమంత్ పాటిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండగా, దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం కోసం సల్మాన్ వెబ్ సైట్ ను ఎలా ఉపయోగించుకుంటారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News