: సినీ నటి అంజలిని హెచ్చరించిన కోర్టు
సినీ నటి అంజలి వివాదం ఎపిసోడ్ ముగిసేలా లేదు. అంజలి పిన్ని, దర్శకుడు కళంజియం మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసు విచారణ నిమిత్తం హాజరు కాకపోవటంపై సైదాపేట కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 12న హాజరు కాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. తమిళ దర్శకుడు కళంజియం, అంజలిపై చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు దాఖలు చేశారు. గతంలో మూడుసార్లు కోర్టుకు డుమ్మా కొట్టిన అంజలి, ఈసారి కూడా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి కేసును ఈ నెల 12 కు వాయిదా వేశారు. గతంలో మద్రాసు హైకోర్టులో ఆమె మిస్సయ్యిందని ఆమె పిన్ని హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. దాని విచారణకు కూడా అంజలి డుమ్మా కోట్టింది. ఇలా గైర్హాజరవుతూ పోతే అంజలిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.