: సిటీ లైట్ హోటల్ యజమాని పరిస్థితి విషమం... సీఎం సందర్శన
సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో ఆ హోటల్ యజమాని హసన్ బులోకి పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో అతని కుమారుడు ముస్తఫా బులోకి ఇప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని, శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇప్పటి వరకూ ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శిధిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.