: సిటీలైట్ పురాతన భవనం కాదు: జీహెచ్ఎంసీ కమిషనర్
సికింద్రాబాద్ లో కూలిపోయిన సిటీలైట్ భవనాన్ని పురాతన భవనంగా గుర్తించలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మీడియాకు తెలిపారు. భవనం ఏ కారణాల వల్ల కూలిపోయిందో విచారణలో వెల్లడవుతుందన్నారు. పురాతన భవనాల గుర్తింపునకు కొత్త విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కువగా పురాతన భవనాలు ఉన్నాయని, ఇప్పటి వరకూ ఇలాంటివి 57 వరకూ గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులకు స్పందించని 15 భవనాలను కూల్చివేశామని చెప్పారు. అద్దెదారులు ఖాళీ చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉందని ఆయన చెప్పారు.