: అబార్షన్ బిల్లును చంపండి, బిడ్డల్ని కాదు... ఐర్లాండ్ లో వెల్లువెత్తిన నిరసన
భారతీయ దంతవైద్యురాలు సవిత మరణంతో ఆరంభమైన అబార్షన్ బిల్లు వ్యతిరేక ఉద్యమం ఐర్లాండ్ లో తీవ్రరూపం దాల్చుతోంది. సవిత మరణించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, ఆమె మృతికి కారణమైన బిల్లును రూపుమాపాలని 35,000 మంది నిరసనకారులు రోడ్డెక్కి జపమాలలు చేబూని, భారీ ర్యాలీ నిర్వహించారు. ఐర్లాండ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్ చేయించుకోవడం నేరం. అనారోగ్యంతో బాధపడుతున్న దంత వైద్యురాలు సవిత తనకు అబార్షన్ చేయాలంటూ కోరినా కడుపులో బిడ్డ బ్రతికి ఉండడంతో చట్టవ్యతిరేక పని చేయలేమంటూ అబార్షన్ కి డాక్టర్లు నిరాకరించారు. ఈ కారణంగా బిడ్డ అడ్డం తిరిగి రక్తస్రావం జరిగి సవిత చనిపోయింది. దీంతో మేల్కొన్న అక్కడి ప్రజలు ఆ బిల్లును రూపుమాపండి, తల్లులను కాపాడండి అంటూ గత ఏడాదిగా ప్రదర్శనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తాజాగా భారీ ప్రదర్శన చేశారు ఐర్లాండ్ దేశస్థులు.