: ఎస్సైని చితకబాదిన గ్రామస్థులు.. కాల్పులు జరిపిన సీఐ
ఓ యువకుడి మృతికి కారణమయ్యాడని ఎస్సైని గ్రామస్థులు చితకబాదారు. విషయం తెలుసుకుని వచ్చిన సీఐ గ్రామస్ధులపై కాల్పులు జరపడంతో, గ్రామస్థులు చేతులకు మరోసారి పని చెప్పేలోపు సీఐ, ఎస్సై పరారయ్యారు. కృష్ణా జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడ్ని వేధించి, అతని మృతికి కారణమయ్యారంటూ, ఆ ఊరి గ్రామస్థులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతన్ని గ్రామస్థులు చితకబాదారు. విషయం తెలుసుకున్న మైలవరం సీఐ గ్రామస్థులపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురు గాయాలపాలయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో సంఘటనా స్థలి నుంచి ఎస్సై, సీఐ పరారయ్యారు.