: రాంచరణ్ మంచి నటుడని వాళ్ళమ్మ చెప్పే వరకు నాకు తెలియదు: చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖా మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహం పట్టలేకపోతున్నారు. ఏ వేదికనెక్కినా ఏదో ఒక రకంగా దాన్ని బయటపెట్టేస్తున్నారు. తాజాగా 'జంజీర్' మీట్ లో మాట్లాడుతూ అసలు రాంచరణ్ మంచి నటుడు, డాన్సర్ అన్న విషయం తన కుమార్తె పెళ్లి వరకూ తనకు తెలియదని అన్నారు. అయితే ఆ విషయం వాళ్లమ్మకు బాగా తెలుసని అన్నారు. ఆ తరువాత తనే... మీ సినిమాలు చూసి చరణ్ డ్యాన్సులు, నటన నేర్చుకున్నాడని తెలిపిందని అన్నారు. రాం చరణ్ యాక్టింగ్ స్కూల్ నుంచి రాలేదని తాను స్వతహాగానే నటుడని తెలిపారు. అలాగే చరణ్ టాలీవుడ్ లో తన స్థానాన్ని ఆక్రమించాడని ప్రకటించారు. దాంతోపాటే బాలీవుడ్ లో పవర్ ఫుల్ సబ్జెక్టుతో బాలీవుడ్ కు యాంగ్రీ యంగ్ మేన్ ను పరిచయం చేసిన సినిమా ద్వారా చెర్రీ పరిచయమవడం ఆనందంగా ఉందన్నారు.