: 100 కోట్ల రూపాయలు దాటుతున్న స్థానిక ఎన్నికల వ్యయం
రాజకీయనాయకులకు పదవుల్ని కట్టబెట్టే ఎన్నికల నిర్వహణకు వ్యయం అంతకంతకు పెరిగిపోతోంది. త్వరలో మన రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు 100 కోట్ల పైనే ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. పోలింగు కేంద్రాలు, ఓటర్ల సంఖ్య పెరగడం, ఎన్నికల సిబ్బందికి కరవు భత్యం, రవాణా వ్యయం పెరగడం ... వంటి రకరకాల కారణాల వల్ల ఈ వ్యయం పెరిగిపోతోందని ఎన్నికల సంఘం చెబుతోంది. 2006లో ఈ ఎన్నికలకు ప్రభుత్వం 95 కోట్లు ఖర్చు పెట్టింది. ఈసారి మాత్రం వంద కోట్లు మించిపోతుందని అంచనా వేస్తున్నారు.