: సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బుద్దగయలో ఈ రోజు ఉదయం జరిగిన బాంబు పేలుళ్లతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, దేశ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు జరుపుతున్నారు. ప్రధానంగా ఇండోనేపాల్ సరిహద్దు వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ అవాంఛనీయ సంఘటన జరుగకుండా విస్తృత తనిఖీలు కూడా చేపట్టారు.