: గూగుల్ లో వెతికే భాషల్లో తృతీయ స్థానం తెలుగుదే


గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా వెతికే భారతీయ భాషల్లో తెలుగుది తృతీయ స్థానం అని గూగుల్ ప్రకటించింది. భారతీయులు సెర్చ్ చేసే సామాజిక సైట్లు, గూగుల్ సెర్చ్ లో తొలి రెండు స్థానాల్లో హిందీ, తమిళం ఉండగా మూడో స్థానంలో తెలుగు నిలిచింది. ప్రపంచవ్యాప్త నెట్ యూజర్లలో గూగుల్ ఉపయోగించే వారిపై నిర్వహించిన సర్వే ఈ రకంగా తెలిపిందని గూగుల్ ప్రకటించింది. ఎన్నారైలలో ఎక్కువ మంది తెలుగు, తమిళం భాషలను సెర్చ్ చేస్తున్నారన్న గూగుల్, ప్రతి 9 ఏళ్లకు ఓసారి జరిపే ఈ సర్వేలో ఈ నిజాలు బయటపడ్డాయని తెలిపింది. సినిమాలు, పాటలు, వీడియోలు, తెలుగు బాష వంటి విషయాల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అయితే తెలుగు, తమిళ సినీఅభిమానులు కాస్త అటూఇటూగా అవే విషయాలను గూగుల్ లో వెతుకుతున్నారని తెలిపింది.

ఈ సందర్భంగా సినీ నిర్మాత ధర్మతేజ చేసిన ప్రకటనను గుర్తు చేసింది. టాలీవుడ్ సినిమాలు అన్ని భాషల వారికి సులువుగా చేరుతాయన్నారు. తెలుగు భాషకు చెందిన సినిమాలు, పాటలు ప్రపంచ వ్యాప్తంగా అలరిస్తూ ఆన్ లైన్లో సులువుగానే దొరుకుతాయని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారని అన్నారు. అలాగే దేశంలో అత్యధికులు మాట్లాడే భాషగా తెలుగు మూడో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News