: రాయలసీమ నేతల రాజీనామా


రాష్ట్ర విభజనకు జరుగుతున్న పరిణామాలపై స్పందించిన రాయలసీమకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు రాజీనామా చేశారు. కడపలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రజాప్రతినిధులంతా ఉద్యమబాట పట్టాలని తీర్మానించారు. రాష్ట్రంలో కంటే ఢిల్లీలోని సోనియా ఇంటివద్దే ఆందోళనలు చేపట్టాలని ఈ సదస్సులో తీర్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణను విడదీసి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరిచ్చారంటూ వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు స్పీకర్ ఫార్మాట్ లో సమర్పించి సంచలనం రేపారు. దీంతో అక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు సమర్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. దీంతో కోరుముట్ల శ్రీనివాసులు, దేవగుడి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణ రెడ్డి, బత్తల పుల్లయ్య కూడా రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో జేఏసీ నేతలకు సమర్పించారు.

  • Loading...

More Telugu News