: ఆరుగురు మావోయిస్టుల ఎన్ కౌంటర్
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే మరో ఎన్ కౌంటర్ జరిగింది. సేవాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ ఉదయం కాల్పులు చో్టుచేసుకున్నాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.