: మహేంద్రుడికి బీసీసీఐ బర్త్ డే విషెస్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ధోనీ సారధ్యంలో భారత్ 2007లో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్, 2011లో వరల్డ్ కప్, ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.