: నిందితులను వదిలేది లేదు: నితీష్ కుమార్
బుద్దగయలోని మహాబోధి ఆలయంలో జరిగిన పేలుళ్లకు పాల్పడిన వారెవరైనా వదిలేదిలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. జరిగిన దాడి దారుణమంటూ బీహార్ ప్రభుత్వం ఖండించింది. మహాబోధి ఆలయాన్ని పరిశీలించిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఐబీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఎన్ఐఏ బృందం మధ్యాహ్నానికి ఘటనాస్థలికి చేరుకుని వివరాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తుందని నితీష్ అన్నారు. ఎన్ఐఏ నివేదిక తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.