: ఐక్యరాజ్యసమితి సభలో మలాలా పుట్టిన రోజు
ఈ నెల 12న ఐక్యరాజ్యసమితి యూత్ అసెంబ్లీలో పాకిస్థాన్ కు చెందిన బాలికల ఉద్యమకారిణి మలాలా యూసఫ్ జాయ్ 16వ పుట్టిన రోజు సంబరాలు జరగనున్నాయి. గతేడాది అక్టోబర్ 9న తాలిబన్ల కాల్పులలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ ఈ బాలిక పుట్టిన రోజును యూత్ అసెంబ్లీలో మలాలాడే గా జరుపుతున్నారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు కూడా హాజరుకానున్నారు. భారత్ తరఫున ఒడిసాకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి లక్ష్మణ్ హెంబ్రం హాజరుకానున్నాడు.
తన పుట్టిన రోజునాడు మలాలా యూత్ అసెంబ్లీ వేదికగా తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రసంగించనుంది. ఐక్యరాజ్యసమితి కార్యదర్శి 'గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్' కార్యక్రమానికి మద్దతుగా దీనిని నిర్వహిస్తున్నారు. 2015నాటికి చిన్నారులందరూ, ముఖ్యంగా బాలికలు అందరూ చదువుకునేలా చూడాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం.