: వింబుల్డన్ ఫైనల్స్ టికెట్ రూ.31లక్షలు
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ప్రియులు ఫైనల్ మ్యాచ్ ఫీవర్లో ఉన్నారు. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. లండన్ నగరంలోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రెకెట్ క్లబ్ లో నేడు మ్యాచ్ జరగనుంది. ముర్రే కప్పు కొడతాడని బ్రిటన్లు నమ్మకాలు పెట్టుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూడడానికి పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. ఒక టికెట్ ఖరీదు మన కరెన్సీలో చెప్పాలంటే 31లక్షల రూపాయలు పలుకుతోంది. ఇంత ధర పలకడం ఇదే మొదటి సారని టికెట్ ఏజెన్సీలు చెబుతున్నాయి.