: కేరెట్ కంటికే కాదు, ఒంటికి కూడా మంచిది!
ఎర్రగా ఉంటూ అందరినీ ఆకర్షించే కేరెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కంటి ఆరోగ్యానికి కేరట్ చాలా మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కేరెట్ వల్ల ఆరోగ్యంతోబాటు మంచి ఆరోగ్యవంతమైన చర్మం కూడా మన సొంతమవుతుంది. అంతేకాదు, క్యాన్సర్ వ్యాధిని కూడా దూరంగా ఉంచుతుందంటున్నారు వైద్యులు.
నేడు కేరట్ ఎరుపు రంగులోనే కాకుండా ఎల్లో, వైట్, పర్పుల్ కలర్స్‌లో కూడా లభిస్తోంది. క్యారెట్‌లో ఉండే సుగుణాలు లంగ్, బ్రెస్ట్ క్యాన్సర్లనే కాదు, పెద్ద పేగు క్యాన్సర్ సమస్యను కూడా దూరంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందులోని విటమిన్ ఎ రేచీకటి రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వయసుతోబాటు శరీరంలో వచ్చే మార్పులను అదుపులో ఉంచుతుంది. శరీరంపై సూర్యరశ్మి వల్ల వచ్చే రాషెస్, పిగ్మెంటేషన్, ముడతలు, డ్రై స్కిన్ వంటి పలు చర్మ సమస్యల నుండి కూడా కేరెట్ మనల్ని రక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు.