: భలే బుల్లి కారు!


మనం రోడ్లపై పెద్ద పెద్ద కార్లను చూస్తుంటాం. ఈ కార్లలో ప్రయాణానికి బాగా అనువుగా ఉంటుంది. కానీ, ఎక్కడైనా రద్దీ ప్రదేశాల్లో వీటిలో ప్రయాణం చేయడం చాలా కష్టం. అలాగే పార్కింగ్‌ చేసేటప్పుడు కూడా కాస్త సమస్యే. అందుకే ఒక బుల్లి కారును తయారు చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాడు ఎలియో. ఇంకేం... చక్కగా మూడు చక్రాలతో ఒక బుల్లి కారును తయారు చేసేశాడు.

అమెరికాలో రోజు రోజుకీ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది. కాస్త పెద్దగా ఉండే కార్లను పార్కింగ్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను అధిగమించాలని భావించాడు పాల్‌ ఎలియో. ఒక బుల్లి కారును తయారు చేశాడు. మూడు చక్రాలతో రూపొందించిన ఈ కారులో ఇద్దరు ప్రయాణించే వీలుంటుంది. 385 కిలోల బరువుండే ఈ కారు ఒక లీటరు పెట్రోలుకు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట. అలాగే భద్రతలో కూడా దీనికి తిరుగులేదని ఎలియో చెబుతున్నాడు. ఇప్పటికి తన పేరుతోనే దీన్ని ఎలియో అనే పిలుస్తున్నాడు. వచ్చే ఏడాది అమెరికన్‌ మార్కెట్లో రాబోతున్న ఎలియో కారు ధర రూ.4 లక్షలు మాత్రమే. ఈ బుల్లి కారుకోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయట కూడా!

  • Loading...

More Telugu News