: 80 శాతం పంచాయతీలు మావే: బాబు
రాష్ట్రంలో 80 శాతం పంచాయతీలు తమ పార్టీ వశం కానున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయబావుటా ఎగురవేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలు దక్కించుకునే జిల్లాలు, నియోజకవర్గాలకు ఎంపీల నిధుల నుంచి ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించనున్నామని తెలిపారు. ప్రధమ ప్రోత్సహంగా 12 లక్షల రూపాయలు, ద్వితీయ ప్రోత్సాహకంగా 6 లక్షలు, తృతీయ ప్రోత్సాహకంగా 3 లక్షల రూపాయల నగదును పంచాయతీ నిధికి కేటాయించనున్నామని ప్రకటించారు. వీటిని సర్పంచులు ఆయా పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తారని చంద్రబాబు తెలిపారు. అనంతరం తెలంగాణలోని 5 జిల్లాల, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు.