: వేడెక్కిన పంచాయతీ రాజకీయం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రాంతీయ సదస్సులతో దూసుకెళుతుండగా, కాంగ్రెస్ నేతలు విమర్శలదాడికి దిగి, మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 'ఆ రెండు పార్టీలు' అంటూ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. బడ్జెట్ ను మించిన వాగ్దానాలతో ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలను రద్దు చేసి స్వంత అజెండాతో ముందుకువెళతారో.. లేక, సర్కారు పథకాలను కొనసాగిస్తూనే, స్వంత పథకాలను అమలు చేస్తారో వెల్లడించాలని ఆ రెండు పార్టీలను కన్నా డిమాండ్ చేశారు.