: ఎవరినైనా, ఎక్కడైనా కలుస్తాం: కోదండరాం


తెలంగాణ కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వద్దంటూ పిలుపునిచ్చి, వారి ఇళ్ళలో విందులకు హాజరవుతున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శల దాడికి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం జవాబిచ్చారు. తెలంగాణ కోసం ఎవరినైనా, ఎక్కడైనా కలుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థనరెడ్డి నిన్న ఇచ్చిన విందుకు కోదండరాం హాజరైన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోదండరాం నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నారని, అందుకే వాళ్ళను కలుస్తున్నామని వివరణ ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లోకి రానివ్వద్దన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాని లను కలిసి తెలంగాణ అంశంపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరతామని కోదండరాం తెలిపారు.

  • Loading...

More Telugu News