: సడక్ బంద్ తో సర్కారుకు దిమ్మ తిరుగుద్ది: కోదండరాం


ఫిబ్రవరి 24న తాము చేపట్టిన సడక్ బంద్ కార్యక్రమంతో సర్కారుకు దిమ్మ తిరుగుతుందని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం మాట మార్చడానికి నిరసనగానే సడక్ బంద్ కార్యక్రమం చేపడుతున్నట్లు కోదండరాం తెలిపారు.

తెలంగాణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. ఆందోళనకారులపై పెడుతున్న బైండోవర్ కేసులు.. తిని పారేసే విస్తరాకుల వంటివని కోదండరాం అన్నారు.

  • Loading...

More Telugu News