: బ్రావోపై మ్యాచ్ నిషేధం


విండీస్ కెప్టెన్ డ్వేన్ బ్రావో ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. భారత్ తో మ్యాచ్ లో కరీబియన్ జట్టు స్లో ఓవర్ రేట్ కు పాల్పడడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేగాకుండా బ్రావో మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టాడు. ఐసీసీ నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.5.1 అనుసరించి.. 12 నెలల వ్యవధిలో రెండుసార్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే జట్టు సారథిపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విండీస్ జట్టు కార్డిఫ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ ఓవర్లను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైంది.

  • Loading...

More Telugu News