: సోనియాకు దిగ్విజయ్ రాష్ట్ర నివేదిక
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పరిస్థితులపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇటీవలే ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ, హైదరాబాద్ లలో రెండు ప్రాంతాల నేతలను కలుసుకుని వారి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరంతా వినిపించిన వాదాల అంశాలతో కూడిన ఓ నివేదికను తయారు చేసి పార్టీ అధిష్ఠానానికి సమర్పించారు. అయితే దిగ్విజయ్ ను పీసీసీ అధ్యక్షుడు కలుసుకున్న తరువాత ఈ నివేదిక సమర్పించడంతో, ఈ నివేదిక దిగ్విజయ్ ఇచ్చినదా? లేక రాష్ట్ర అధిష్ఠానమిచ్చినదా? అన్న అనుమానాలు రెండు ప్రాంతాల నేతల్లో కలుగుతున్నాయి. దీని యాక్షన్ ఏమిటన్నది మేడమ్ రియాక్షన్ బట్టి తెలుస్తుందని గుసగులాడుకుంటున్నారు.