: సీఎంను కలిసిన తెలుగు తంబీలు


తమిళనాడులోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. చెన్నైలో త్వరగా ఆంధ్రాభవన్ ను నిర్మించాలని కోరారు. అలాగే తమ రాష్ట్రంలో తెలుగు మూడో స్థానానికి పడిపోయిందని, తెలుగు పుస్తకాలు దొరకడం కూడా కష్టంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో తెలుగువారికి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News