: బాధితులను ఆదుకున్నది రాజకీయలబ్ది కోసం కాదు: బాబు స్పష్టీకరణ


ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకున్నది రాజకీయలబ్ది కోసం కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నేడు జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతోనే వారిని ఆదుకున్నామని వివరించారు. బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాబు విమర్శించారు. ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా బాధితులను వారి స్వస్థలాలకు చేర్చే క్రమంలో టీడీపీ తీవ్రంగా శ్రమించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలే ఇవ్వడం దారుణమని, ఇతర రాష్ట్రాల బాటలోనే రూ.10 లక్షలు ఇవ్వాలని బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News