: ప్రత్యేక తెలంగాణ రాదు: రాయపాటి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశమే లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అంటున్నారు. జాతీయ నేతల్లో కేవలం శరద్ పవార్, అజిత్ సింగ్ చెప్పినంత మాత్రాన తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమిస్తే మరిన్ని చిన్న రాష్ట్రాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనీ .. అందుకే తెలంగాణ ఇప్పట్లో రాదనీ రాయపాటి స్పష్టం చేశారు. తెలంగాణ వస్తుందనుకోవడం కేసీఆర్ భ్రమ అని ఆయన అన్నారు.