: భవిష్యత్ పరిణామాలను సోనియాకు వివరించిన రామచంద్రయ్య
మంత్రి సి.రామచంద్రయ్య నేడు హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఆమెతో జరిగిన భేటీలో మంత్రి తెలంగాణ అంశంపై చర్చించారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రలో ఏర్పడే పరిణామాలను ఆయన.. సోనియాకు వివరించారు.ఈ క్రమంలో మున్ముందు చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయంపైనా మంత్రి సోనియాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు సాగింది.