: త్వరలోనే అయోధ్యలో గొప్ప రామాలయం: బీజేపీ
అయోధ్యలో గొప్ప రామాలయాన్ని త్వరలోనే నిర్మిస్తామని, ఉత్తరప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ అమిత్ షా ప్రకటించారు. అయోధ్యలో సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. రామాలయాన్ని నిర్మించి రాముడిని సరైన స్థానానికి(బాబ్రీ కూల్చివేత స్థలం) మారుస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి హిందుత్వ కార్డును బయటకు తీసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.