: లగడపాటి రాజకీయనేత కాదు: గుత్తా
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసలు రాజకీయనాయకుడే కాదంటున్నారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి నిన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. లగడపాటి ఓ వ్యాపారవేత్త మాత్రమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నేతలే అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.