: హైదరాబాద్ లో టీడీపీ సదస్సుకు సర్వం సిద్ధం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలను స్థానిక సమరానికి సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ శిబిరాల ప్రధాన లక్ష్యం. ఇటీవలే విశాఖపట్నం, ఈడ్పుగల్లు, తిరుపతిలో సదస్సులు నిర్వహించిన టీడీపీ.. తాజాగా హైదరాబాద్ లో ఈ శిక్షణ శిబిరం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అధినేత చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పాల్గొనేందుకు తిరుపతి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ శిబిరానికి కొంపల్లిలోని ఎక్స్ లెన్సీ గార్డెన్స్ వేదిక. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు.