: క్రూడ్ దెబ్బకు మళ్లీ పెట్రోల్ ధరకు రెక్కలు!
అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదిపాటు స్థిరంగా ఉన్న క్రూడాయిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ఆయిల్ కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఈజిప్టులో రాజకీయ సమస్యల కారణంగా క్రూడాయిల్ ధర నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారెల్ 107 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనివల్ల దేశంలో మరోసారి పెట్రోల్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే రూపాయి విలువ క్షీణత వల్ల గత నెలరోజుల్లో పెట్రోల్ ధరలు రెండు సార్లు పెరిగి లీటర్ 75 రూపాయలకు చేరుకుంది. సమీప భవిష్యత్తులో క్రూడాయిల్ 110 డాలర్లు దాటి ముందుకు వెళితే దేశీయంగా పెట్రోల్ ధర లీటరుకు మూడు రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉంది.