: 21వ దశాబ్దం చాలా వేడిది!
1850 నుండి ఇప్పటి వరకూ పోల్చుకుంటే 2001-2010 దశాబ్దం చాలా వేడి దశాబ్దంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 1850 నుండి ఆధునిక విధానం ప్రకారం ఉష్ణోగ్రతలను లెక్కకడుతున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే గత దశాబ్దాన్ని అంతకుముందు గడచిన వాటితో పోల్చితే అధిక ఉష్ణోగ్రత కలిగిన దశాబ్దంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎంఓ) వెల్లడించింది.
గత శతాబ్దంలో యూరప్, రష్యాల్లో సంభవించిన వేడి గాలులు, యుఎస్‌లో సంభవించిన కత్రినా తుఫాను, మయన్మార్‌లో నర్గిస్ తుఫాను ఇలా పలు ప్రాంతాల్లో సంభవించిన వాతావరణ వ్యత్యాసాలు, స్థానిక, భౌగోళిక ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసాలను గురించి డబ్ల్యుఎంఓ తన రిపోర్టులో వెల్లడించింది. 2001-10 మధ్య కాలంలో భూమి మరియు సముద్ర ఉపరితలంపైని ఉష్ణోగ్రతల సరాసరి గురించి ఈ రిపోర్టులో పేర్కొన్నారు. దీని ప్రకారం సరాసరి ఉష్ణోగ్రత వ్యత్యాసాలను పరిశీలిస్తే 1961-90 నుండి 1991-2000 మధ్య కాలంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలో చాలా పెరుగుదల కనిపిస్తోంది. వీటన్నింటిలోకి 21వ శతాబ్దాన్ని అత్యంత వేడి దశాబ్దంగా పేర్కొంటున్నారు. ఈ శతాబ్దంలో 1991-2000తో పోల్చుకుంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఆ దశాబ్దంలో 2008 మినహాయించి మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసుకున్నాయని రిపోర్టులో వెల్లడించారు.