: ట్విటర్‌లో కొత్త సౌలభ్యం


మీరు అరబిక్‌ భాషలోని ట్వీట్‌లను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే మీలాంటి వారికోసమే ట్విటర్‌ ఒక కొత్తరకం సర్వీసును సిద్ధం చేస్తోంది. ఈజిప్టుకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకునేందుకు ఈ సర్వీసు బాగా ఉపకరించనుంది.

ట్విటర్‌ ఇప్పటికే యూరోపియన్‌ భాషలైన ఇటాలియన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషల్లోకి తర్జుమా చేసే విధంగా తన సేవలను అందిస్తోంది. ఇప్పుడు అరబిక్‌ భాషకు కూడా తన సేవలను విస్తరించింది. ఈజిప్టు భాష రానివారు కూడా ఈజిప్టు అధ్యక్షుడు మహమద్‌ మోర్సి గురించి ట్విటర్‌లో చేసే ట్వీట్‌లను తమ స్థానిక భాషలో చదువుకునేందుకు వీలుగా ట్విటర్‌ తన సేవలను అందుబాటులోకి తేనుంది. అంతేకాదు, ఈజిప్ట్‌ 2013 అనే పేరుతో అన్ని ఈజిప్షియన్‌ అకౌంట్లను ఇది తర్జుమా చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది.

  • Loading...

More Telugu News