: పీకల దాకా తాగి పోలీసుల వీరంగం


మద్యం మత్తులో పోలీసులు రెచ్చిపోయారు. పీకల దాకా తాగి ఎదురు తిరిగిన లారీ డ్రైవర్ ను చితకబాదారు. ఎందుకలా కొడుతున్నారని వారి దౌర్జన్యాన్ని నిలదీసిన వ్యక్తిని 'పోలీస్ లా మజాకా?' అనేలా ఇరగదీశారు. ఘటన వివరాల్లో కెళితే, కీసరలో ఎదురు తిరిగాడని లారీ డ్రైవర్ ను నడిరోడ్డు మీద తీవ్రంగా కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అదేంటని ప్రశ్నించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు పోలీసుల వ్యవహారంపై కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. తాగేసి ఇష్టమెచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటూ పోలీసుల తీరుపై స్థానికులు మండి పడుతున్నారు.

  • Loading...

More Telugu News