: జార్ఖాండ్ లో కొత్త ప్రభుత్వం


జార్ఖాండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. అలాగే, కాంగ్రెస్, జేఎంఎం ఐదు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ఒప్పందం చేసుకున్నాయి. రానున్న ఎన్నికల్లో జార్ఖాండ్ నుంచి కాంగ్రెస్ 10, జేఎంఎం 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నెల 17 న రాష్ట్రపతి పాలన ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబుసోరేన్ కుమారుడు హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్నారు. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో జార్ఖాండ్ తో పాటు ఒడిషా, బీహార్, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పని చేయనున్నాయి.

  • Loading...

More Telugu News