: ఇష్రత్ జహాన్ కేసులో హేడ్లీ వ్యాఖ్యలు ఎందుకు ప్రస్తావించరు? : బీజేపీ


గుజరాత్ పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఇష్రత్ జహాన్ అమాయకురాలని, ఎన్ కౌంటర్ బూటకమని ఘోషిస్తున్న కాంగ్రెస్ నేతలు డేవిడ్ హేడ్లీ చెప్పిన సాక్ష్యాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ 2010లో షికాగోలో డేవిడ్ హేడ్లీని విచారించిన సందర్భంగా, అతను ఇష్రత్ జహాన్ ను మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలిగా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎఫ్ బీఐ చెప్పిందని కూడా సీబీఐ నిర్ధారించిందన్నారు. కేవలం మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తుతోంది. హేడ్లీ వాంగ్మూలాన్ని వందపేజీల్లో సీబీఐకి సమర్పించిన ఎన్ఐఏను అడిగితే నిజానిజాలు వెలికివస్తాయని చెబుతోంది.

  • Loading...

More Telugu News